
మొదటి కంటెస్టెంట్ చాలా కూల్ గా ఫన్ గా వెళ్తున్న బిగ్ బాస్ అగ్నిపరీక్షలా రన్నింగ్ రాజా వచ్చి మంట పెట్టాడు. అంటే శ్రీముఖి స్టేజి వదిలేసి వెళ్ళిపోయింది. స్టేజి హీటెక్కిపోయింది. కర్నూల్ నుంచి రన్నింగ్ రాజా వచ్చాడు. శ్రీముఖి కూడా కూల్ గా రన్ చేస్తూ చెప్పండి అంది. ఇక శ్రీముఖిని టార్గెట్ చేసాడు. "హాయ్ హలో నేను మీ శ్రీముఖి. హార్టీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఒరేయ్ ... పాపాయమ్మ బాగున్నావా. సర్ మా పనిమనిషి పాపాయమ్మ. డైరెక్టర్ గారు చెప్పండి. లింకులు చెప్పేద్దామా... ఏంటి వినపడలేదు నేను చాలా అందంగా ఉన్నానా అయ్యో ప్రతీ వాళ్ళు ఇదే మాట అంటుంటారు అయ్యో . సరే ఇప్పుడు లింకులు చెప్పేద్దాము ఇంకెందుకాలస్యం జ్యూరీలను ఇన్వైట్ చూసేద్దామా సో ముందుగా ఎవరొస్తున్నారంటే ఎవరైనా నన్ను ఏమన్నా అన్నారంటే వాళ్లకు పెడ్తా పిత్తు ... ఇప్పుడొచ్చేసింది అభిజిత్తు. నెమలి నాట్యం చేస్తే అందరి కనులకు విందు. వచ్చింది మా బిందు. అందరికీ జోష్ రావాలంటే కావలి ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కి జోష్ రావాలంటే కావాలి మా నవదీప్ . సో ఇలా ఉంటుంది. ఏమా పాపాయమ్మ ఒక్కణ్ణే ఇంతలా అరుస్తుంటే " అని రన్నింగ్ రాజా అనేసరికి శ్రీముఖి ఫైర్ ఐపోయింది. నువ్వు పోతావా నన్ను పొమ్మంటావా అంది "మీరుండాలి నేనుండాలి ఈ షో హిట్ అవ్వాలి " అన్నాడు. "మీ టాలెంట్ మీ మిమిక్రీ చూపిస్తే బిగ్ బాస్ కి పంపిస్తారని మీరు అనుకుని వచ్చారా ఇక్కడికి " అన్నాడు నవదీప్. "పొలంలో పని చేసినా. ఏ పనైనా చేస్తా. ఎవరితో ఎలా మెలగాలో నాకు తెలుసు " అన్నాడు.
"శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది. ఎలా మెలగాలో తెలుసన్నావ్ ఎలా మెదులుతావో మెదులు " అంది బిందు మాధవి. "అక్కా నా బంగారు తల్లి. " అంటూ దగ్గరకు రాబోతుండగా. " దూరం నుంచి మాట్లాడు. టచ్ చేస్తే చెంప మీద కొడతా దూరం వెళ్ళు. " అంది . ప్లీజ్ అక్కా సారీ సారీ అన్నాడు. శ్రీముఖి చేతిలోని పేపర్స్ విసిరేసి సీట్ లోంచి లేచి వెళ్ళిపోయింది. ఇక నవదీప్ "మీరు ఏ షోకి వచ్చారు. ఎం చేయాలి ఎం చేయకూడదు అని తెలుసుకుని నెక్స్ట్ టైం వెళ్తున్న షోకి వెళ్ళండి. ఇక స్టేజి మీద పడిపోయి ఏడ్చాడు. వెళ్ళిపోతూ " అమ్మా నేను సాన మందికి సమాధానం చెప్పాలా " అన్నాడు. "వెళ్లి చెప్పు మరి ఎవరొద్దన్నారు " అన్నాడు నవదీప్. "నా చెల్లెలు ఒక్కటే మాట అనింది ఎప్పుడైనా తలెత్తుకునేలా చెయ్యి అని " అన్నాడు రన్నింగ్ రాజా. "బానే చేస్తున్నావ్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ అవే చేసుకుంటూ ఉండు " అన్నాడు నవదీప్. "బిగ్ బాస్ చాలా పెద్ద షో సర్ " అన్నాడు. "అవును అక్కడి వరకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవ్వు " అన్నాడు. ఇక రన్నింగ్ రాజా ఏడుస్తూ వెళ్ళిపోయాడు.